Lok Sabha Elections | న్యూఢిల్లీ, మే 30: ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో దాదాపు 150 స్థానాల్లో ఒక్క మహిళా అభ్యర్థి కూడా పోటీలో లేరని తాజా నివేదిక వెల్లడించింది. అంటే 27.6 శాతం స్థానాల్లో నారీమణులు బరిలో లేరని ఢిల్లీకి చెందిన టీక్యూహెచ్ పేర్కొన్నది. మహిళా అభ్యర్థుల్లో 14.4 శాతం మందిని ప్రాంతీయ పార్టీలు నామినేట్ చేశాయని, జాతీయ పార్టీలు టికెట్ ఇచ్చిన మహిళా అభ్యర్థుల సంఖ్య 11.8 శాతంగా మాత్రమే ఉన్నదని తెలిపింది. స్వతంత్ర అభ్యర్థుల్లో 7.1 శాతం మంది మాత్రమే మహిళలు అని నివేదించింది.
ఒడిశా- 15.4%, పశ్చిమబెంగాల్- 13.8%, ఛత్తీస్గఢ్- 13.2%
వరంగల్(తెలంగాణ), బారామతి(మహారాష్ట్ర)- 8
కరూర్(తమిళనాడు), కోల్కతా(పశ్చిమ బెంగాల్)-7