బుధవారం 20 జనవరి 2021
National - Dec 28, 2020 , 08:58:07

కరోనా కొత్త వైరస్‌తో వణుకుతున్న తమిళనాడు

కరోనా కొత్త వైరస్‌తో వణుకుతున్న తమిళనాడు

చెన్నై: కరోనా కొత్త వైరస్‌తో తమిళనాడు వణికిపోతున్నది. ఇప్పటికే దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో టాప్‌ ఫైవ్‌లో ఉన్నది. తాజాగా వెలుగుచూసిన కరోనా కొత్త వైరస్‌తో ప్రభుత్వం ఆందోళనకు గురవుతున్నది. రాష్ట్రానికి ఇప్పటివరకు బ్రిటన్‌ నుంచి 1438 మంది వచ్చారు. అందులో 13 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. కాగా, వారిని కలిసిన మరో 12 మందికి కూడా కరోనా సోకినట్లు తేలింది. దీంతో బ్రిటన్‌ నుంచి వచ్చినవారిని ఇంకెంత మంది కలిసారనే విషయం గురించి ప్రభుత్వం ఆరా తీస్తున్నది. వారిని గుర్తించడానికి అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాష్ట్రంలో బ్రిటన్‌ నుంచి వచ్చినవారిలో 13 మందికి పాజటివ్‌ వచ్చిందని, వారి ద్వారా మరో 12 మందికి కరోనా వైరస్‌ సోకిందని తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సీ విజయభాస్కర్‌ తెలిపారు.   


logo