కోల్కతా: రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ 17వ అధ్యక్షునిగా స్వామి గౌతమానందజీ మహారాజ్ (95) ఎన్నికయ్యారు. గత నెలలో స్వామి స్మరణానందజీ మహారాజ్ పరమపదించిన నేపథ్యంలో ఈ ఎన్నిక జరిగింది. మఠం బోర్డు ట్రస్టీలు, మిషన్ పాలక మండలి బేలూరు మఠంలో బుధవారం సమావేశమై స్వామి గౌతమానందజీని నూతన అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఆయనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మన సమాజం మరింత విజ్ఞానంతో, కారుణ్యంతో నడిచే విధంగా ఆయన మార్గదర్శకత్వం వహించాలని ఆకాంక్షించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కూడా స్వామిని అభినందించారు.