Most Polluted Cities | ప్రపంచంలో వాయు కాలుష్యం అత్యధికంగా ఉన్న టాప్–20 నగరాల జాబితాలో ఏకంగా 13 నగరాలు భారతదేశం నుంచే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ ఐక్యూ ఎయిర్ కాలుష్యంపై రూపొందించిన ‘ద వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024’ నివేదిక విడుదలైంది. ఇందులో ప్రపంచంలో ఐదో అత్యంత కలుషిత దేశంగా భారత్ నిలిచింది.
ఇక ఈ జాబితాలో అస్సాంలోని బైర్నిహాట్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో దేశ రాజధాని ఢిల్లీ, పంజాబ్లోని ముల్లన్పుర్, ఫరీదాబాద్, లోని (ఘజియాబాద్), న్యూ ఢిల్లీ, గురుగ్రామ్, గంగానగర్, గ్రేటర్ నోయిడా, భివాడి, ముజఫర్నగర్, హనుమాన్గఢ్, నోయిడా ఉన్నాయి. ఇక ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరిత రాజధానిగా (Polluted Capital) ఢిల్లీ తొలి స్థానంలో కొనసాగుతోంది. 2023లో ఈ సంస్థ విడుదల చేసిన జాబితాలో ప్రపంచంలోని మూడో అత్యంత కలుషిత వాతావరణ దేశంగా భారత్ నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఐదో అత్యంత కలుషిత దేశంగా ఇండియా నిలిచింది.
Also Read..
Bomb Attack | పాఠశాలపై బాంబులతో దాడి.. షాకింగ్ వీడియో
Bhupesh Baghel | మద్యం కుంభకోణం.. మాజీ సీఎం కుమారుడికి ఈడీ సమన్లు