AAP | ఇటీవలే జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఆ షాక్ నుంచి తేరుకోకముందే ఆ పార్టీకి ఇప్పుడు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన దాదాపు 13 మంది ఢిల్లీ కౌన్సిలర్లు (Delhi councillors) ఆప్‌కు రాజీనామా చేశారు. ఇందులో రెబల్ కౌన్సిలర్లు ముఖేష్ గోయల్ (Mukesh Goel) కూడా ఉన్నారు.
ఆయన నాయకత్వంలో వీరంతా థర్డ్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తమ పార్టీ పేరును (new party) కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. ‘ఇంద్రప్రస్థ వికాస్’ పేరుతో పార్టీని ( Indraprastha Vikas Party) ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గోయెల్ ఆదర్శ్ నగర్ నియోజకవర్గం నుంచి ఆప్ టికెట్‌పై పోటీ చేసి ఓటమి చవిచూశారు.
ఇక రాజీనామా చేసిన రెబల్ కౌన్సిలర్లలో.. ముఖేష్ గోయల్, హేమంచంద్ గోయల్, దినేష్ భరద్వాజ్, హిమానీ జైన్, ఉషా శర్మ, సాహిబ్ కుమార్, రాఖీ కుమార్, అశోక్ పాండే, రాజేష్ కుమార్, అనిల్ రాణా, దేవేంద్ర కుమార్, హిమానీ జైన్ ఉన్నారు. గత మున్సిపల్ ఎన్నికలకు ముందు వీరంతా కాంగ్రెస్‌ను వీడి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఇక 25 ఏళ్లుగా మున్సిపల్ కౌన్సిలర్‌గా పనిచేసిన గోయెల్.. 2021లో కాంగ్రెస్‌ను వీడి ఆప్‌లో చేరారు. మరోవైపు మూడు నెలల క్రితమే ఆప్‌కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు అనితా బసోయ, నిఖిల్ చప్రానా, ధరమ్వీర్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో 13 మంది కౌన్సిలర్లు రాజీనామా చేయడం ఢిల్లీ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.
Also Read..
Boycott Turkey | తుర్కియే బ్రాండ్స్ అమ్మకాలను నిలిపివేసిన మింత్ర, అజియో
Helicopter | కేదార్నాథ్ వద్ద ఎయిర్ అంబులెన్స్ క్రాష్ ల్యాండింగ్
ISIS sleeper cells | ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఇద్దరు ఐసిస్ సభ్యులు అరెస్ట్