Bihar Elections | బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద పోటెత్తారు.
పలువురు ప్రముఖులు సైతం తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ అధ్యక్షుడు (RJD president), బీహార్ మాజీ ముఖ్యమంత్రి (Bihar former CM) లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav), ఆయన భార్య రబ్రీదేవి, మహాగఠ్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్, కేంద్రమంత్రులు, రాజీవ్ రంజన్ సింగ్, గిరిరాజ్ సింగ్, నిత్యానంద్ రాయ్, బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా తదితరులు ఓటుహక్కు వినియోగించుకున్నారు.
ఓటింగ్ ప్రారంభమైన రెండు గంటల్లో అంటే ఉదయం 9 గంటల వరకు 13.13 శాతం పోలింగ్ (Bihar First Phase Voting) నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తొలి విడతలో భాగంగా 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాల్లో ఇవాళ (గురువారం) పోలింగ్ జరుగుతోంది. ఈ నెల 11న మిగితా 122 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరుగనుంది. ఈ నెల 14న ఫలితాలను వెల్లడించనున్నారు.
13.13% approximate voter turnout recorded in the first phase of #BiharElection2025, till 9 am. pic.twitter.com/cMkp5z2xi5
— ANI (@ANI) November 6, 2025
Also Read..
Donald Trump | 7 కాదు 8 జెట్లు కూలాయి.. భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని ఆపింది నేనే : ట్రంప్
Lalu Yadav | కుటుంబంతో కలిసి ఓటేసిన లాలూ యాదవ్.. నవంబర్ 14న మార్పు ఖాయమని వ్యాఖ్య