Lalu Yadav : ఆర్జేడీ అధ్యక్షుడు (RJD president), బీహార్ మాజీ ముఖ్యమంత్రి (Bihar former CM), కేంద్ర మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వి యాదవ్, కోడలు రాజ్శ్రీ యాదవ్, కుమార్తె మీసా భారతితో కలిసి పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు.
ఓటు వేసిన అనంతరం లాలూ యాదవ్ మాట్లాడుతూ.. నవంబర్ 14న రాష్ట్రంలో స్పష్టమైన మార్పు కనిపించబోతున్నదని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో మహాగఠ్బంధన్ ఘన విజయం సాధించబోతున్నదని ధీమా వ్యక్తంచేశారు. తేజస్వి యాదవ్ మాట్లాడుతూ.. బీహార్లో మార్పు కోసం ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు.
బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తొలి విడతలో భాగంగా 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాల్లో ఇవాళ (గురువారం) పోలింగ్ జరుగుతోంది. ఈ నెల 11న మిగితా 122 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరుగనుంది. ఈ నెల 14న ఫలితాలను వెల్లడించనున్నారు.