Donald Trump | భారత్-పాక్ (India-Pakistan) విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి పాత పాటే పాడారు. ఇరుదేశాల మధ్య శాంతికి తాను మధ్యవర్తిత్వం వహించినట్లు చెప్పుకొచ్చారు. వాణిజ్య సుంకాలతో ఈ వార్‌కు బ్రేకులు వేసినట్లు మరోసారి ట్రంప్ చెప్పారు.
అయితే ఈ యుద్ధంలో కూలిన ఫైటర్ జెట్ల సంఖ్యను ట్రంప్ మరింత పెంచారు. ఇప్పటి వరకూ ఏడు జెట్లు కూలిపోయాయని (Fighter Jets) చెబుతున్న ట్రంప్.. ఇప్పుడు ఎనిమిదిగా పేర్కొన్నారు. మియామిలో జరిగిన అమెరికా బిజినెస్ ఫోరంలో పాల్గొన్న ట్రంప్ ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ సందర్భంగా తనను తాను ప్రపంచ శాంతికర్తగా చెప్పుకున్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎనిమిది యుద్ధాలను ఆపినట్లు చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read..
శ్రీశ్రీ రవిశంకర్‌కు ‘వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ’ అవార్డు
మెక్సికో అధ్యక్షురాలికి బహిరంగ లైంగిక వేధింపులు