మెక్సికో : సాక్షాత్తూ దేశ అధ్యక్షురాలే బహిరంగంగా లైంగిక వేధింపులకు గురైన దారుణ ఘటన మెక్సికోలో చోటుచేసుకుంది. రాజధానిలో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమానికి హాజరైన మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా సీన్బామ్ను ఒక ఆకతాయి బహిరంగంగా తాకుతూ ఆమెను ముద్దుపెట్టుకోవడానికి ప్రయత్నించాడు.
ఈ వీడియో వైరల్ కావడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేశ అధ్యక్షురాలికే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.