తిరువనంతపురం: శ్రీలంకకు వెళ్లే 120కిపైగా విమానాలు కేరళలో ల్యాండ్ అయ్యాయి. కాగా, ఆ రాష్ట్రంలోని ఎయిర్‌పోర్టుల అధికారులు సమయానుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అభినందించారు. శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సే బుధవారం ఆ దేశాన్ని వీడి మాల్దీవులకు వెళ్లారు. ఈ నేపథ్యంలో తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ప్రధాని రణిల్ విక్రమసింఘే దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
మరోవైపు శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక, రాజకీయ సంక్షోభం వల్ల ఆ దేశానికి వెళ్లాల్సిన 120కిపైగా విమానాలు కేరళ ఎయిర్‌పోర్టుల్లో ల్యాండ్ అయ్యాయి. శ్రీలంకకు బయలుదేరిన ఈ విమానాలు పలు సాంకేతిక కారణాలతో త్రివేండ్రం, కొచ్చి ఎయిర్‌పోర్టుల్లో దిగాయి. ఇందులో భారత్‌తో సహా విదేశీ విమానాలు కూడా ఉన్నాయి.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు ఈ మేరకు సహాయం చేసిన త్రివేండ్రం, కొచ్చి విమానాశ్రయాలను ఆయన అభినందించారు. ‘శ్రీలంకకు వెళ్లే 120కుపైగా విమానాలకు సాంకేతిక ల్యాండింగ్‌ను అనుమతించడం ద్వారా ఈ విమానాశ్రయాలు తమ విధిని మించిపోయాయి. మన పొరుగువారితో సంబంధాలను మరింతగా పెంచుకునేందుకు ఇది చాలా దోహదపడుతుంది’ అని సింధియా ట్వీట్ చేశారు.
Kudos Trivandrum & Kochi airports for demonstrating the Indian spirit of वसुधैव कुटुम्बकम्!
The airports have gone beyond their call of duty by allowing technical landing to 120+ aircraft bound for Sri Lanka. The gesture will go a long way in furthering ties with our neighbour.
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) July 13, 2022