హైదరాబాద్, నవంబర్ 1(నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్లోకి వలసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని దివ్యాంగుల హక్కుల కోసం పోరాడిన యూనియన్ నేత భిక్షపతితోపాటు బాబూరావు, కైలాశ్, ప్రవీణ్ తదితరులు గులాబీపార్టీలో చేశారు. శనివారం తెలంగాణభవన్‌లో దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్, మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దివ్యాంగుల పింఛన్లు పెంచుతామని మాటతప్పిన కాంగ్రెస్ సర్కార్‌కు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బుద్ధిచెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.