భువనేశ్వర్: బీజేపీ పాలిత ఒడిశాలోని సబర్నపూర్ జిల్లాలో శుక్రవారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. ఓ షోరూమ్‌లో పని చేస్తున్న యువతిపై ముగ్గురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. విధులు పూర్తి చేసుకున్న అనంతరం ఇంటికి వెళ్తున్న బాధితురాలిని ముసుగు ధరించిన ముగ్గురు వ్యక్తులు అడ్డగించి ముఖంపై మత్తు మందు చల్లారు. ఆమె స్పృహ కోల్పోయిన వెంటనే రోడ్డు పక్కకు ఈడ్చుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. స్పృహ వచ్చిన తర్వాత బాధితురాలు తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తర్వాతి రోజు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.