సత్న: ఓ బీజేపీ ఎంపీ సహనం కోల్పోయి మున్సిపల్ కార్మికుడిపై చేయి చేసుకున్న ఘటన మధ్యప్రదేశ్లోని సత్న జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది. సమైక్యతా పరుగు సందర్భంగా శుక్రవారం సేమ్రియ చౌక్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశాక బీజేపీ ఎంపీ గణేష్ సింగ్ హైడ్రాలిక్ క్రేన్ నుంచి కిందకు దిగుతుండగా హఠాత్తుగా గాల్లోనే నిలిచిపోయింది. అందులో నుంచి బయటపడేందుకు ఆయన అనేక విధాలుగా ప్రయత్నించారు. ఇంతలో ఆయనకు సాయపడేందుకు క్రేన్ ఆపరేటర్ ముందుకు వచ్చారు. ఆ మున్సిపల్ కార్మికుడిని దుర్భాషలాడుతూ చేతులు లాగిన ఎంపీ అందరి ముందే అతడి చెంప చెళ్లుమనిపించారు.