హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని కొండా లక్ష్మణ్‌బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం రూపొందించిన రాష్ట్ర ఉద్యాన ప్రణాళిక-2035ను వర్సిటీ వీసీ డాక్టర్ రాజిరెడ్డి గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మకు అందజేశారు. శనివారం గవర్నర్ కార్యాలయంలో ఆయనను కలిసి ఇటీవల నిర్వహించిన యూనివర్సిటీ నాల్గో స్నాతకోత్సవ ఆల్బమ్‌ను గవర్నర్‌కు బహూకరించారు.
రాష్ట్రంలో కూరగాయలు, పండ్లు, పూలు, సుగంధ ద్రవ్యాల పంటలసాగు, రైతులకు ఒనగూరే మేలు, సమకూరే ఆదాయ వివరాలను ఉద్యాన ప్రణాళికలో పొందుపర్చామని వీసీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఏ భగవాన్ ఉన్నారు.