ముంబై, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితాలో గందరగోళం నెలకొంది. తాజాగా పన్వేల్ విధాన సభ నియోజకవర్గంలో ఒక వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓటర్ల జాబితా 390లో ఒక మహిళా ఓటరు పేరు రర హహ అని, ఆమె భర్త పేరు కక దద” అని ఉంది. నవీ ముంబైలోని బేలాపూర్ నియోజకవర్గంలోని కొన్ని చోట్ల ఓటర్ల చిరునామాను పబ్లిక్ టాయిలెట్‌గా పేర్కొన్నారు. ఇంకో చోట ఒకే మొబైల్ నంబర్ తో దాదాపు 288 మంది ఓటర్ జాబితాలో పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ అవకతవకలపై ఎంఎన్ఎస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. నిరసనగా శనివారం ఎంఎన్ఎస్, మహా వికాస్ అఘాడి సంయుక్తంగా ముంబైలో నిరసన ప్రదర్శన చేపట్టాయి. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల జాబితాలను తనిఖీ చేయాలని& రాజ్ థాకరే తమ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.