న్యూఢిల్లీ, మే 31: లోక్సభ ఎన్నికలు వేళ దేశ వ్యాప్తంగా జరిగిన సోదాల్లో 1,150 కోట్ల విలువైన నగదు, బంగారాన్ని ఆదాయపు పన్ను శాఖ స్వాధీనం చేసుకుంది. 2019 ఎన్నికల్లో పట్టుబడిన రూ.392 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు మూడు రెట్లు అధికం. వీటిలో ఢిల్లీ, కర్ణాటక రాష్ర్టాల్లో 200 కోట్లకు పైగా నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులో 150 కోట్లు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాల్లో 100 కోట్లకు పైగా పట్టుబడినట్టు శుక్రవారం ఆ శాఖ అధికారులు తెలిపారు. సీఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత మార్చి 16 నుంచి నియమావళి అమలులోకి రావడంతో పోలీస్, ఐటీ శాఖ ఈ దాడులు చేపట్టాయి. 10 లక్షలకు మించి పట్టుబడిన నగదును ఆదాయపు పన్ను శాఖకు పంపుతారు.