Crocodile | భారీ వర్షాలకు నదుల్లో ఉండాల్సిన మూగజీవాలు జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఇప్పటికే పలు చోట్ల మొసళ్లు (Crocodile) గ్రామాల్లోకి ప్రవేశించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన ఘటనలు అనేకం చూశాం. అలాంటి ఘటనే గుజరాత్ రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకుంది.
సౌరాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ వర్షాలకు రాష్ట్రంలోని నదులు, డ్యాములు నిండుకుండను తలపిస్తున్నాయి. పలు నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తూ ఆ నీరంతా పరివాహక ప్రాంతాల్లోకి పోటెత్తుతోంది. దీంతో నదుల్లోని సరీసృపాలు గ్రామాల్లోకి కొట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో వడోదర జిల్లాలోని విశ్వామిత్ర నది నుంచి భారీగా మొసళ్లు జనావాసాల్లోకి కొట్టుకొచ్చాయి. వడోదర (Vadodara)లోని మహారాజా సాయాజీరావు యూనివర్సిటీ క్యాంపస్ (Maharaja Sayajirao University)లోని జువాలజీ విభాగానికి సమీపంలో 11 అడుగుల మొసలిని స్థానికులు గుర్తించారు. మొసలిని చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
#WATCH | Vadodara, Gujarat: Forest Department rescues the crocodile seen on the campus of the Maharaja Sayajirao University of Baroda pic.twitter.com/joBQjJfAHW
— ANI (@ANI) August 29, 2024
వర్సీటీ వద్దకు చేరుకున్న అధికారులు స్థానికుల సాయంతో మొసలిని సురక్షితంగా బంధించారు. ‘గత ఐదు రోజుల్లో దాదాపు 10 మొసళ్ళను రక్షించాం. వాటిలో రెండింటిని ఇప్పటికే నీటిలో విడుదల చేశాం. ఇంకా ఎనిమిది మొసళ్లు మా వద్దే ఉన్నాయి. నదిలో నీటి మట్టం తగ్గిన వెంటనే వాటిని కూడా విడుదల చేస్తాము’ అని ఓ అధికారి తెలిపారు. వడోదరలోని అకోటా ప్రాంతంలో కూడా ఓ మొసలి ఇంటి పైకప్పు ఎక్కిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కాగా, వడోదరకు 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నది మొసళ్లకు నిలయంగా చెప్పుకుంటారు. ఇక్కడ దాదాపు 300కుపైగా మొసళ్లు ఉంటాయని అంచనా.
VIDEO | Gujarat Rains: Crocodile spotted at roof of a house as heavy rainfall inundate Akota Stadium area of Vadodara.
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz)#GujaratRains #GujaratFlood pic.twitter.com/FYQitH7eBK
— Press Trust of India (@PTI_News) August 29, 2024
Also Read..
Kylian Mbappe | ఫుట్‌బాల్ స్టార్ ‘ఎక్స్’ ఖాతా హ్యాక్.. వివాదాస్పద పోస్ట్‌లతో నింపేశారు..!
RJD Leader | బెంగాల్లో బీజేపీ అరాచకం : తేజస్వి యాదవ్