Kylian Mbappe : ఫ్రాన్స్ స్టార్ ఫుట్‌బాలర్ కిలియన్ ఎంబాపే (Kylian Mbappe) కొత్త క్లబ్ రియల్ మాడ్రిడ్ తరఫున తొలి గోల్ కోసం నిరీక్షిస్తున్నాడు. ఈ సమయంలో అతడికి పెద్ద షాక్ తగిలింది. ఎంబాపే ఎక్స్ అకౌంట్‌ను ఎవరో హ్యాక్(Hack) చేశారు. ఇదే అదనుగా హ్యాకర్లు అతడి పేరిట పలు ఇబ్బందికర పోస్ట్‌లు పెట్టారు. అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ(Lionel Messi) కంటే పోర్చుగల్ హీరో క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo)నే ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ ఫుట్‌బాలర్ అని పోస్ట్ చేశారు.
అంతేకాదు.. ఫుట్‌బాలర్ పేరిట క్రిప్టో కరెన్సీ పోస్టులను పెట్టారు. పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమనే ఇజ్రాయేల్ – పాలస్తీనాల గురించి కూడా ఎంబాపే ఖాతాలో హ్యాకర్లు నానా చెత్త రాసుకొచ్చారు. అయితే.. కాసేపటికి హ్యాకర్లు ఆ పోస్ట్‌లను తొలిగించినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
Primer tituló con el mejor club del mundo !!!! Vamos por más !!!!
¡HalaMadrid! 🤍🤍🤍 @realmadrid pic.twitter.com/ruksazaB8U— Kylian Mbappé (@KMbappe) August 14, 2024
ఫుట్‌బాల్ దిగ్గజంగా ఎదుగుతున్న ఎంబాపే కొత్త క్లబ్ రియల్ మాడ్రిడ్ తరఫున తొలి టైటిల్ గెలిచాడు. ఎన్నో రోజుల నిరీక్షణకు తెరదించుతూ రియల్ మాడ్రిడ్ (Real Madrid) క్లబ్ జెర్సీ వేసుకున్న ఎంబాబే ఆ జట్టు ట్రోఫీ విజయంలో భాగమయ్యాడు. ఆగస్టు 14, బుధవారం జరిగిన యూఈఎఫ్ఏ సూపర్ కప్ (UEFA Super Cup 2024) ఫైనల్లో రియల్ మాడ్రిడ్ 2-0తో అట్లాంటా (Atlanta)పై జయకేతనం ఎగురవేసింది. దాంతో ఎంబాపే మస్త్ ఖుషీ అవుతున్నాడు.
ప్రపంచ ఫుట్‌బాల్‌లో సంచలనంగా మారిన ఎంబాపే 2007లో మొనాకో క్లబ్ నుంచి పారిస్ సెయింట్ జర్మనీ (Paris Saint Germany) చేరాడు. అప్పటి నుంచి ఏడేండ్లు ఆ క్లబ్‌కు ఆడాడు. పీఎస్జీ తరఫున 306 మ్యాచ్‌లు ఆడిన ఎంబాపే 255 గోల్స్ కొట్టడమే కాకుండా 108 గోల్స్ చేయడంలో సహచరులకు సహాయం చేశాడు. కొత్త సీజన్‌కు ముందు పీసీజీతో ఏడేండ్లుగా ఉన్న బంధానికి ఎంబాపే బై బై చెప్పేశాడు.
రెండేండ్ల క్రితం ఖతర్‌లో జరిగిన వరల్డ్ కప్‌లో ఎంబాపే అదరగొట్టాడు. అర్జెంటీనా(Arjentina)తో హోరాహోరీగా ఫైనల్లో హ్యాట్రిక్ గోల్స్ (Hat-trick Goals) కొట్టి లియోనల్ మెస్సీ సేనను వణికించాడు. కానీ, అనూహ్యంగా షూటౌట్లో 2-4తో ఫ్రాన్స్ ఓటమి పాలైంది. జట్టుకు వరల్డ్ కప్ అందించలేకపోయిన ఎంబాపే.. అత్యధికంగా 8 గోల్స్ కొట్టి ‘గోల్డెన్ బూట్'(Golden Boot) అవార్డు అందుకున్నాడు.