Rahul Gandhi | క్రీడా దినోత్సవం సందర్భంగా రాహుల్ కీలక ప్రకటన.. త్వరలో భారత్ డోజో యాత్ర
Rahul Gandhi | నేడు జాతీయ క్రీడా దినోత్సవం (National Sports Day). ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రత్యేక వీడియోను షేర్ చేస్తూ కీలక ప్రకటన చేశారు.
Rahul Gandhi | నేడు జాతీయ క్రీడా దినోత్సవం (National Sports Day). ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రత్యేక వీడియోను షేర్ చేస్తూ కీలక ప్రకటన చేశారు. గతంలో ‘భారత్ జోడో యాత్ర’ సమయంలో తమ శిబిరాల వద్ద జరిగిన జియు-జిట్సు (jiu-jitsu) ప్రాక్టీస్ సెషన్‌కు సంబంధించిన వీడియోను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా త్వరలో ‘భారత్ డోజో యాత్ర’ (Bharat Dojo Yatra) రాబోతోందంటూ ప్రకటించారు.
రాహుల్ గతంలో ‘భారత్ జోడో యాత్ర’, ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ పేరిట దేశవ్యాప్తంగా తిరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఇక యాత్ర శిబిరాల వద్ద మార్షల్ ఆర్ట్స్ సెషన్స్‌ను కూడా నిర్వహించారు. ఫిట్‌గా ఉండేందుకు ప్రతి రోజూ జియు-జిట్సు ఆర్ట్స్‌ను ప్రాక్టీస్ చేసేవాళ్లు. జియు-జిట్సు అనేది బ్రెజిల్ మార్షల్ ఆర్ట్.
జోడో యాత్రలో రోజూ సాయంత్రం శిబిరంలో మార్షల్ ఆర్ట్ జియు-జిట్సు సాధన చేసేవారు. నేడు స్పోర్ట్స్ డే సందర్భంగా ఆ అనుభవాలను తాజాగా వీడియో రూపంలో పంచుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. ఇక ఇదే ట్వీట్లో త్వరలో ‘భారత్ డోజో యాత్ర’ రాబోతోందంటూ రాహుల్ ప్రకటించారు. ‘డోజో’ అంటే మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణనిచ్చే కేంద్రాలను డోజో అని పిలుస్తారు.
During the Bharat Jodo Nyay Yatra, as we journeyed across thousands of kilometers, we had a daily routine of practicing jiu-jitsu every evening at our campsite. What began as a simple way to stay fit quickly evolved into a community activity, bringing together fellow yatris and… pic.twitter.com/Zvmw78ShDX
— Rahul Gandhi (@RahulGandhi) August 29, 2024
Also Read..
Vishal | సమస్యలుంటే ఫిర్యాదు చేయండి : కాస్టింగ్ కౌచ్‌పై నటుడు విశాల్
Samantha | హేమ కమిటీ రిపోర్ట్‌పై స్పందించిన సమంత.. అవి మహిళల కనీస అవసరాలంటూ పోస్ట్
KTR | విద్యార్థులంటే.. ఈ కాంగ్రెస్ సర్కార్‌కు ఎందుకింత చిన్నచూపు..? సూటిగా ప్రశ్నించిన కేటీఆర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

