Mirzapur 3 | ఇండియన్ మోస్ట్ పాపులర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ‘మీర్జాపూర్ 3’ (Mirzapur 3) ఓటీటీలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన దీని రెండు భాగాలు రికార్డు స్థాయి వ్యూస్‌తో భారీ ప్రేక్షకాదరణను సొంతం చేసుకోగా.. తాజాగా వచ్చిన మూడో సీజన్ ‘మీర్జాపూర్ 3’ (Mirzapur 3) ఆల్‌టైం రికార్డు వ్యూస్ అందుకుంటున్నట్లు అమెజాన్ ప్రకటించింది.
అయితే సీజన్ 3కి సంబంధించి బోనస్ ఎపిసోడ్ ఉందని అలీ ఫజల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ బోనస్ ఎపిసోడ్ మోస్ట్ వైలెంట్‌గా ఉండబోతుందని ఇందులో నేను చంపిన వ్యక్తి కూడా తిరిగిరాబోతున్నాడని అలీ ఫజల్ ప్రకటించాడు. అయితే చెప్పినట్లుగానే బోనస్ ఎపిసోడ్‌కు సంబంధించి సాలిడ్ అప్డేట్ ప్రకటించారు మేకర్స్. తాజాగా ‘మీర్జాపూర్ 3’ బోనస్ ఎపిసోడ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ఎపిసోడ్లో మున్నా భయ్యా (దివ్యేందు శర్మ) మళ్లీ రాబోతున్నట్లు తెలుస్తుంది. నేను చనిపోయిన అనంతరం షో అంతా గందరగోళంగా మారిందని.. నా లోయల్ ఫ్యాన్స్ కోసం బోనస్ ఎపిసోడ్లో రాబోతున్నట్లు మున్నా ప్రకటించాడు. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ పండుగా చేసుకుంటున్నారు. దీనిపై ఒక నెటిజన్లు రాసుకోస్తూ.. మున్నా భయ్యా లేకుండా ‘మీర్జాపూర్’ లేదని కామెంట్లు పెడుతున్నారు.
Bawaal hone wala hai, kyuki bonus episode aa raha hai 😎🔥#MirzapurOnPrime, Bonus Episode, 30th Aug. pic.twitter.com/B6Ka45FMWm
— prime video IN (@PrimeVideoIN) August 29, 2024
Also Read..