Balakrishna | తొలి ప్రేమ సినిమాతో డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వెంకీ అట్లూరి (Venky Atluri) . ఆ తర్వాత రంగ్ దే, మిస్టర్ మజ్ను సినిమాలను ప్రేక్షకులకు అందించిన ఈ యువ దర్శకుడు ధనుష్‌తో సార్ సినిమాను తెరకెక్కించి మంచి హిట్టందుకున్నాడు. ప్రస్తుతం మాలీవుడ్ స్టార్ హీరో దుల్కన్ సల్మాన్‌తో లక్కీ భాస్కర్ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ దీపావళి కానుకగా గ్రాండ్‌గా విడుదలకు రెడీ అవుతుంది.
కాగా ఈ యంగ్ డైరెక్టర్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. బాలకృష్ణ ఇటీవలే అడ్వర్టైజింగ్స్తో కూడా సందడి చేస్తున్నాడని తెలిసిందే. ఇటీవలే బాలకృష్ణ, సంయుక్తామీనన్పై వచ్చే ఓ యాడ్‌ను వెంకీ అట్లూరి డైరెక్ట్ చేశాడు. ఈ యాడ్‌కు సంబంధించితెలుపు, గోధుమ రంగు చొక్క, లుంగీలో సంప్రదాయక లుక్‌లో చిరునవ్వులు చిందిస్తున్న బాలయ్య స్టిల్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
మొత్తానికి బాలకృష్ణను సూపర్ లుక్‌లో ప్రజెంట్ చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాడు వెంకీ అట్లూరి. మరి రాబోయే రోజుల్లో ఈ ఇద్దరి కాంబోలో సినిమా వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు అభిమానులు.
Ei madhya 14,15 years key chudataniki musali vallala ayipothunaru
alantidhi 16 year’s vachina kuda eintha fit and young ga vundatam #balaya garike sontham #SaripodhaaSanivaarsm #Nani #GabbaSingh4K #Balakrishna #TeluguDesamParty #GOLD #Telegram #pawankalyan #Janasena pic.twitter.com/C2mjEMB9sC— Sravani sravya (@battu426) August 28, 2024
Saripodhaa Sanivaaram | నాని-వివేక్ ఆత్రేయ సరిపోదా శనివారంపై నెటిజన్ల టాక్ ఎలా ఉందంటే..?
Sreeleela | కోలీవుడ్ ఎంట్రీకి శ్రీలీల రెడీ.. ఏ స్టార్ హీరోతోనంటే..?
Coolie | రజినీకాంత్ కూలీలో మంజుమ్మెల్ బాయ్స్ నటుడు.. ఇంతకీ పాత్రేంటో మరి..?
Vettaiyan | వెట్టైయాన్ ఫినిషింగ్ టచ్.. తలైవా టీం కొత్త అప్డేట్ ఇదే..!