శనివారం 16 జనవరి 2021
National - Dec 25, 2020 , 18:20:47

యూకే నుంచి వ‌చ్చిన 10 మందికి క‌రోనా

యూకే నుంచి వ‌చ్చిన 10 మందికి క‌రోనా

బెంగ‌ళూరు:‌ ఇటీవ‌ల యునైటెడ్ కింగ‌డమ్ (యూకే) నుంచి క‌ర్ణాట‌క‌కు వ‌చ్చిన 10 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని ఆ రాష్ట్ర ఆరోగ్య‌శాఖ మంత్రి కే సుధాక‌ర్ తెలిపారు. అయితే, వారిలో ఉన్న‌ది యూకేలో ప్ర‌స్తుతం విస్త‌రిస్తున్న‌కొత్త ర‌కం క‌రోనానా కాదా..? అనే విష‌యం తెలుసుకునేందుకు వారి శాంపిల్స్‌ను NIMHANSకు పంపిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ఈ టెస్టుల‌ ఫలితాలు వెల్ల‌డైన అనంత‌రం అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు చేప‌డుతామ‌ని చెప్పారు. 

న‌వంబ‌ర్ 25 నుంచి డిసెంబ‌ర్ 22 వ‌ర‌కు యూకే నుంచి క‌ర్ణాట‌క‌కు 2,500 మంది వ‌చ్చార‌ని క‌ర్ణాట‌క ఆరోగ్య మంత్రి చెప్పారు. ఎయిర్ ఇండియా, బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానాల ద్వారా వారు వ‌చ్చార‌ని, ప్ర‌స్తుతం వారంద‌రినీ గుర్తించి ప‌రీక్ష‌లు చేయించే ప‌నిలో అధికారులు ఉన్నార‌ని తెలిపారు.    

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.