ఇంఫాల్, మే 15: మణిపూర్‌లోని చందల్ జిల్లాలో బుధవారం అస్సాం రైఫిల్స్ చేపట్టిన ఆపరేషన్‌లో కనీసం పది మంది మిలిటెంట్లు మృతిచెందినట్టు తూర్పు కమాండ్ ఆర్మీ అధికారులు ఎక్స్ వేదికగా వెల్లడించారు.
ఇండో-మయన్మార్ సరిహద్దు ఖేంగ్జోయ్ తహసిల్ పరిధిలోని న్యూ సంతాల్ గ్రామం సమీపంలో మిలిటెంట్ల కదలికలపై నిఘా వర్గాలకు అందిన సమాచారం మేరకు స్పియర్ కార్ప్స్ ఆధ్వర్యంలో అస్సాం రైఫిల్స్ ఈ ఆపరేషన్ చేపట్టినట్టు పేర్కొన్నారు.