Encounter | ఛత్తీస్గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలో మరోసారి భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. దక్షిణ సుక్మా (Sukma)లోని భెజ్జీ ప్రాంతం కుంటా పోలీస్ స్టేషన్ పరిధిలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, మావోయిస్టుల మద్య శుక్రవారం ఉదయం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.
ఈ ఎదురుకాల్పుల్లో 10 మంది మావోలు హతమయ్యారు (Maoists Killed). ఇక్కడ ఉదయం నుంచి ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్లు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో మావోల కోసం వేట కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగినట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కిరణ్ చవాన్ ధృవీకరించారు. ఎన్కౌంటర్ ప్రాంతం నుంచి మూడు ఆటోమేటిక్ తుపాకులతో పాటు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
Also Read..
Adani bribery case | అదానీ వ్యవహారంపై స్పందించిన అగ్రరాజ్యం అమెరికా
Canada Vs India | భారత్ ఆగ్రహంతో వెనక్కి తగ్గిన కెనడా.. ఆ కథనాల్లో వాస్తవం లేదంటూ ప్రకటన
IPL 2025 | క్రికెట్ అభిమానులకు గుడ్న్యూస్.. తదుపరి మూడు ఐపీఎల్ సీజన్ల తేదీలు వచ్చేశాయ్..!