Prabhas | పాన్ ఇండియా స్టార్ యాక్టర్ ప్రభాస్, టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో సినిమా రాబోతున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మైథలాజికల్ సినిమాగా రాబోతున్న ఈ చిత్రానికి Baka టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు ఫిలింనగర్ సర్కిల్ ఇన్ సైడ్ టాక్. టాలీవుడ్ లీడింగ్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్న ఈ సినిమా కోసం ఇప్పటికే ప్రభాస్‌కు సంబంధించిన టెస్ట్ షూట్ కూడా పూర్తయినట్టు సమాచారం.
కాగా ఈ ప్రాజెక్ట్ సిల్వర్ స్క్రీన్‌పైకి రావడం కష్టమేనని కొత్త పుకార్లు షికారు చేస్తున్నాయి . ఈ సినిమాకు సంబంధించిన పనులపై నమ్మకం కలగకపోవడం వల్ల ప్రభాస్ ఇక మూవీని ముందుకు తీసుకెళ్లకూడదని ఫిక్సయ్యాడట. ఇదిలా ఉంటే ముందుగా ప్రశాంత్ వర్మ బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణ్ వీర్ సింగ్‌తో సినిమా ప్రకటించగా.. ఆ తర్వాత రణ్ వీర్ సింగ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తున్న కథనాల ప్రకారం ప్రశాంత్ వర్మ ఇదే స్క్రిప్ట్‌ను ప్రభాస్‌కు కూడా వినిపించాడట.
మరి ఈ లెక్కన రణ్ వీర్ సింగ్ రూట్లోనే ప్రభాస్ కూడా వెళ్లాలని ఫిక్సయ్యాడంటూ చర్చించుకుంటున్నారు మూవీ లవర్స్. తాజా పుకార్లతో అయోమయంలో పడిపోయారు ప్రభాస్ ఫ్యాన్స్. మరి ఈ ప్రాజెక్టుపై రాబోయే రోజుల్లో ప్రభాస్ కానీ, ప్రశాంత్ వర్మ కానీ ఏదైనా అధికారిక ప్రకటన చేస్తారేమో చూడాలి.