IPL 2025 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) 18వ సీజన్ కోసం అతృతగా ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్‌న్యూస్. రాబోయే మూడు ఐపీఎల్ సీజన్ల తేదీలను ఒకేసారి ఖరారు చేశారు (next three seasons announced). ఈ మేరకు శుక్రవారం ఉదయం బీసీసీఐ వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.
సదరు కథనాల ప్రకారం.. ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 14వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మే 25తో ముగియనుంది. ఇక ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 15న ప్రారంభమై మే 31తో ముగియనుంది. ఐపీఎల్ 2027 ఎడిషన్ మార్చి 14న మొదలై మే 30తో ముగియనుంది. ఈ మేరకు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ అధికారిక సమాచారం అందించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే, దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Mark your calendars, IPL fans! 🏏 The BCCI has announced dates for the next three IPL seasons:
📅 2025: March 14 – May 25
📅 2026: March 15 – May 31
📅 2027: March 14 – May 30Excitement builds as the IPL auction kicks off this Sunday! 🔥 #IPL2025 #IPL2026 #IPL2027 #IPLAuction pic.twitter.com/WgkBat9qn1
— Dibya Lochan Mendali (@dibyamendali) November 22, 2024
మరోవైపు ఐపీఎల్-2025కి ముందు మెగావేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. యువ క్రికెటర్లతోపాటు సీనియర్ ఆటగాళ్లు వేలానికి రానున్నారు. ఈ సారి వేలం పూల్‌లో 318 మంది అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్, 12 మంది అన్క్యాప్డ్ ప్లేయర్స్ సహా మొత్తం 574 మంది ఆటగాళ్లు ఉన్నారు. షార్ట్‌లిస్ట్ చేసిన ఆటగాళ్ల జాబితాలో 366 మంది భారతీయ ఆటగాళ్లు, 208 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. ఈ వేలం యువ క్రికెటర్లకు కీలకం కానున్నది. 204 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు తీసుకోనుండగా.. ఇందులో 70 మంది విదేశీ ఆటగాళ్లకు చోటు కల్పించనున్నది.
Also Read..
Perth Test | కుప్పకూలిన టీమ్ఇండియా టాపర్డార్.. భారత్ @ 47/4
RC16 | రాంచరణ్ ఆర్సీ16 షూట్ టైం.. మైసూర్ టెంపుల్ ముందు బుచ్చి బాబు సాన
Rafael Nadal | టెన్నిస్ లెజెండ్ టాప్ -10 షాట్లు.. ప్రత్యర్థులు బిత్తరపోయారంతే..!