పెర్త్: ప్రత్యర్థి మారినా టీమ్ఇండియా బ్యాటర్లు మాత్రం మారలేదు. స్వదేశంలో న్యూజిలాండ్ జరిగిన టెస్ట్ సిరీస్‌లో బ్యాటింగ్‌లో భారత్ ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. తాజాగా ఆసీస్‌తోనూ ఇండియన్ బ్యాట్స్‌మెన్ అదే ఆటతీరును కనబరుస్తున్నారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా (Perth Test) జరుగుతున్న తొలి టెస్టులో భారత టాపర్డర్ కుప్పకూలింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్, ఫస్ట్ డౌన్లో వచ్చిన దేవ్‌దత్ పడిక్కల్ వచ్చినట్లే వచ్చి పెవీలియన్‌కు చేరారు. 12 బంతులు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ అతికష్టం మీద ఐదు పరుగులు చేసి వెనుతిరిగాడు. ఇక ఫామ్‌లేమితో బాధపడుతూ కెప్టెన్ రోహిత్ గైర్హాజరీతో ఓపెనింగ్‌కు వచ్చిన కేఎల్ రాహుల్ (74 బాల్స్‌లో 26 రన్స్).. బాగానే ఆడుతున్నట్లు కనిపించినా మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమ్ఇండియా 47 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ప్రస్తుతం రిషభ్ పంత్ (10), ధృవ్ జురెల్ (9 బాల్స్‌లో 4 రన్స్) క్రీజులో ఉన్నారు.
ఓపెనర్ జైస్వాల్ రెండో ఓవర్లోనే స్టార్క్ బౌలింగ్‌లో ఖాతా తెరువకుండానే తొలివికెట్‌గా వెనుతిరిగాడు. అనంతరం పడిక్కల్ జట్టు స్కోరు 14 రన్స్ వద్ద, కోహ్లీ 32 రన్స్ వద్ద, రాహుల్ 47 పరుగుల వద్ద ఔటయ్యారు. ఆసిస్ బౌలర్లలో స్టార్క్, హేజిల్‌వుడ్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
1ST Test. WICKET! 22.2: K L Rahul 26(74) ct Alex Carey b Mitchell Starc, India 47/4 https://t.co/dETXe6cqs9 #AUSvIND
— BCCI (@BCCI) November 22, 2024