Canada Vs India | భారత్ ఆగ్రహంతో వెనక్కి తగ్గిన కెనడా.. ఆ కథనాల్లో వాస్తవం లేదంటూ ప్రకటన
Canada Vs India | ఖలిస్థానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఘటన నేపథ్యంలో భారత్ - కెనడా దేశాల (Canada Vs India) మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
Canada Vs India | ఖలిస్థానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఘటన నేపథ్యంలో భారత్ – కెనడా దేశాల (Canada Vs India) మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ విషయంలో భారత్‌పై కెనడా ప్రభుత్వం తన అక్కసును వెల్లగక్కుతోంది. నిత్యం భారత ప్రధాని (PM Modi), భారత అధికారులపై ఏదో ఒక ఆరోపణ చేస్తూనే ఉంది. ఈ ఉద్రిక్తతల వేళ కెనడా మీడియాలో వచ్చిన ఓ కథనం ఇప్పుడు సంచలనంగా మారింది.
నిజ్జర్ హత్య వెనుక భారత ప్రధాని మోదీతోపాటు పలువురు ప్రముఖుల హస్తం ఉన్నదని కెనడాకు చెందిన భద్రతా సంస్థలు ఆరోపించాయని ఆ దేశ దినపత్రిక ‘ది గ్లోబ్ అండ్ మెయిల్’ ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది. ఇప్పటికే భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు అంతంత మాత్రం ఉండగా, ఈ వార్తా కథనం దానికి మరింత ఆజ్యం పోసినట్లైంది. ఈ కథనాలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఆ వార్తాకథనం హాస్యాస్పదం అంటూ తోసిపుచ్చింది. భారత్ ఆగ్రహంతో తాజాగా కెనడా వెనక్కి తగ్గింది.
న్యూఢిల్లీ ఆగ్రహంతో దిగొచ్చిన కెనడా ప్రభుత్వం.. మీడియాలో వచ్చిన కథనాలను కొట్టిపారేసింది. నిజ్జర్ హత్య కేసు కుట్రలో ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పేర్లను తాము ఎన్నడూ ప్రస్తావించలేదని పేర్కొంది. వార్తాపత్రికలో వచ్చిన కథనాలు అవాస్తవమేనంటూ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ కేసులో భారతీయ అధికారులను నేరుగా దోషులుగా చూపే ఎలాంటి ఆధారాలు తమ వద్ద లేవని ఒట్టావా స్పష్టం చేసింది. దీనికి భిన్నంగా ఎలాంటి కథనాలు ప్రచురితమైన అవన్నీ ఊహాజనితం, అవాస్తవమేనని ట్రూడో సర్కార్ తమ ప్రకటనలో వెల్లడించింది.
ఉన్నతస్థాయి చర్చల తర్వాతే నిజ్జర్ హత్య..!
కెనడా పత్రిక కథనం ప్రకారం.. నిజ్జర్ హత్యకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కుట్ర పన్నారని, ఈ విషయాన్ని మోదీతోపాటు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు సమాచారం ఇచ్చారని కెనడా జాతీయ భద్రతా అధికారి ఒకరు తెలిపారు. భారత ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వ్యక్తుల మధ్య చర్చలు జరిగిన తరువాతనే నిజ్జర్ హత్య చోటుచేసుకున్నట్టు కెనడా భద్రతా సంస్థలు భావిస్తున్నాయని ఆ అధికారి పేర్కొన్నారు. నిజ్జర్ హత్యలో మోదీతోపాటు జైశంకర్, అజిత్ దోవల్ పాత్ర ఉన్నట్టు ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి. ప్రధాని మోదీకి తెలియకుండా ఓ పరాయి దేశంలో ముగ్గురు సీనియర్ రాజకీయ ప్రముఖులు హత్యకు కుట్ర చేశారనుకోవడం నమ్మశక్యం కానిదని ఆ భద్రతా అధికారి అభిప్రాయపడ్డారు. నిజ్జర్ హత్య వెనుక మాస్టర్ మైండ్ అమిత్‌షాదేనని అటు అమెరికా, ఇటు కెనడా ఇంటెలిజెన్స్ వర్గాలు నిర్ధారణకు వచ్చినట్టు ఆ అధికారి తెలిపారు.
Also Read..
IPL 2025 | క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్.. తదుపరి మూడు ఐపీఎల్ సీజన్ల తేదీలు వచ్చేశాయ్..!
Harish Rao | బోనస్‌ను బోగస్‌గా చేసిన కాంగ్రెస్ సర్కార్: హరీశ్ రావు
Bagheera | ఓటీటీలోకి కేజీఎఫ్ డైరెక్టర్ బఘీరా.. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే..?
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

