ముంబై: ఒకరి నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు ఓ యువకుడు (Accident) బలయ్యాడు. మరో మహిళ తీవ్ర గాయాలపాలైంది. నవీ ముంబైలోని తలోజా ఎంఐడీసీ వద్ద రోడ్డుకు అపసవ్య దిశలో ఓ మహిళ, యువకుడు నడుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో అతివేగంగా దూసుకొచ్చిన ఒక కారు వారిని ఢీకొట్టింది. దీంతో మహిళతోపాటు ఆ యువకుడు అంతెత్తు ఎగిరి పడ్డారు. యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా, ఆ మహిళ తీవ్రంగా గాయపడింది.
మృతిచెందిన యువకుడిని లాలూ నారద్ తాంటి అలియాస్ దాస్ (29), గాయపడిన మహిళను ప్రమీళ ప్రభాకర్ దాస్‌గా (44) గుర్తించారు. వారిద్దరు తలోజాలోని పద్ఘేగావ్లో నివసిస్తున్నారని పోలీసులు చెప్పారు. అయితే దాస్ బీహార్‌కు చెందినవాడని, ఉపాధి నిమిత్తం నవీ ముంబైకి వచ్చాడని తెలిపారు. కాగా, మంళవారం (జనవరి 14న) ఉదయం 9.47 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కనే ఉన్న ఓ షాప్‌లో ఉన్న కెమెరాలో ప్రమాదానికి సంబంధించిన దృష్యాలు రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
In India, your safety is not in your hands!
📍Navi Mumbai
pic.twitter.com/43rQtNRKI8— Roads of Mumbai (@RoadsOfMumbai) January 14, 2025