Sabarimala Pilgrims | కేరళ (Kerala) రాష్ట్రం కొల్లాం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శబరిమల భక్తుల (Sabarimala Pilgrims)తో వెళ్తున్న బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. డజను మందికిపైగా గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున 3:45 గంటల ప్రాంతంలో ఆర్యన్కావు (Aryankavu) గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అతి వేగంగా వెళ్తున్న లారీ.. బస్సును బలంగా ఢీ కొట్టింది. దీంతో బస్సు రోడ్డు పక్కన 40 అడుగుల లోతులోకి పడిపోయింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మృతుడు సేలంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో చిన్నారులు, వృద్ధులు సహా మొత్తం 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
Also Read..
Maharashtra | మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ను కలవనున్న మహాయుతి నేతలు
Sambhal | సంభల్ వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు.. వెనుదిరిగిన రాహుల్, ప్రియాంక
Air Pollution | ఢిల్లీ వాసులకు కాస్త ఉపశమనం.. మెరుగుపడిన గాలి నాణ్యత