1.27 కోట్ల బెడ్షీట్లు మాయం.. రైల్వే ఏసీ కోచ్‌లలో ప్రయాణికుల చేతివాటం
ఇండియన్ ఏసీ రైల్వే కోచ్‌లలో ప్రయాణికుల చేతివాటం సంచలనంగా మారింది. రైళ్లలోని ఏసీ కోచ్‌లలో పడుకోవడానికి బెడ్ రోల్ (రెండు బెడ్షీట్లు, ఒక దుప్పటి, ఒక దిండు, దిండు కవర్, టవల్) ఏర్పాటు చేస్తారు.
న్యూఢిల్లీ : ఇండియన్ ఏసీ రైల్వే కోచ్‌లలో ప్రయాణికుల చేతివాటం సంచలనంగా మారింది. రైళ్లలోని ఏసీ కోచ్‌లలో పడుకోవడానికి బెడ్ రోల్ (రెండు బెడ్షీట్లు, ఒక దుప్పటి, ఒక దిండు, దిండు కవర్, టవల్) ఏర్పాటు చేస్తారు. అయితే ఈ బెడ్‌రోల్స్‌ను కొందరు ప్రయాణికులు ఎత్తుకెళ్తున్నట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం వెల్లడించింది. 2022 నుంచి 2026 వరకు 1.27 కోట్ల బెడ్‌రోల్స్ ఎత్తుకెళ్లారని ఈ కథనం తెలిపింది. ప్రతి వెయ్యి మంది ప్రయాణికుల్లో ఒకరు బెడ్‌షీట్ లేదా దుప్పటిని తీసుకెళ్తున్నారని రైల్వే అధికారులు తెలిపినట్టు ఈ కథనం పేర్కొంది.
54 డివిజన్లలో ఆర్టీఐ అప్లికేషన్లు..
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రతినిధులు దేశంలోని 54 డివిజన్లలో, 16 జోన్లలో ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేయగా ఈ వివరాలు బయటకొచ్చినట్టు తెలిపింది. 2022 నుంచి 2025 మధ్య ఈ దొంగతనాలు 56 శాతం పెరిగాయని ఈ కథనం తెలిపింది. అయితే వీటిని అదుపు చేయడానికి తీసుకుంటున్న చర్యలను మాత్రం ఈ కథనంలో వెల్లడించలేదు. ఏసీ కోచ్‌లలో ఆర్థికంగా ఉన్నవాళ్లే ఉంటారు. అలాంటిది వారు ఇలా బెడ్షీట్లను తీసుకెళ్లడంపై సర్వత్రా చర్చ జరుగుతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

