న్యూఢిల్లీ: ప్రాచీన సంస్కృతీ, చరిత్రను ప్రతిబింబించేలా ఢిల్లీ నగరం పేరును ‘ఇంద్రప్రస్థ’గా మార్చాలని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) డిమాండ్ చేసింది. అలాగే ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఢిల్లీ రైల్వే స్టేషన్ పేర్లను ఇంద్రప్రస్థ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌గా, ఇంద్రప్రస్థ రైల్వే స్టేషన్‌గా మార్చాలని కోరింది.
ఈ మేరకు ఢిల్లీ సాంస్కృతిక మంత్రి కపిల్ శర్మకు వీహెచ్‌పీ లేఖ రాసింది. దీనిపై వీహెచ్‌పీ ఢిల్లీ కార్యదర్శి సురేంద్ర కుమార్ గుప్తా మాట్లాడుతూ ‘ఢిల్లీ అని చెప్పినప్పుడు కేవలం 2,000 సంవత్సరాల చరిత్ర కనపడుతుంది. అదే ఇంద్రప్రస్థ అని చెబితే.. 5వేల సంవత్సరాల చరిత్రతో అనుసంధానం అవుతాం’ అని అన్నారు.