‘ది రాజాసాబ్’ దాదాపు పూర్తికావచ్చింది. ‘ఫౌజీ’ని కూడా ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నారు ప్రభాస్. దీని తర్వాత ‘స్పిరిట్’ సెట్లోకి ఎంటరవుతారాయన. ఇందులో పవర్ఫుల్ కాప్‌గా ప్రభాస్ నటించబోతున్నారు. నిజానికి ‘స్పిరిట్’ వర్క్ ఎప్పుడో మొదలైంది. ప్రీప్రొడక్షన్ వర్క్‌కు ఎక్కువ సమయం తీసుకోవడం దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ైస్టెల్. బౌండ్ స్క్రిప్ట్‌ని చేత పట్టుకొని పక్కా ప్లానింగ్‌తో ముందుకెళ్తారాయన. ఈ సినిమాకు సంబంధించిన సెట్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ నేతృత్వంలో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తి చేశారు.
ఒక్కసారి షూటింగ్ మొదలుపెడితే, సరిగ్గా వందరోజుల్లో చిత్రీకరణ మొత్తం కంప్లీట్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు సందీప్‌రెడ్డి వంగా, ‘యానిమల్’ సినిమా షూటింగ్‌ని కూడా ఆయన కేవలం వందరోజుల్లోనే ముగించారట. అదే విధానాన్ని ‘స్పిరిట్’ విషయంలోనూ అవలంబిస్తున్నారాయన. త్వరలోనే సినిమా షూటింగ్ మొదలుకానున్నది.
ఇదిలావుంటే.. ఇందులోని యాక్షన్ సన్నివేశాల కోసం ప్రభాస్ కొత్త గెటప్‌ని ట్రై చేస్తున్నారట. ఈ సీక్వెన్స్‌లో ప్రభాస్ గెటప్ అండ్ సెటప్ చాలా థ్రిల్లింగ్‌గా ఉండేలా సందీప్ ప్లాన్ చేశారని వినికిడి. త్రిప్తి డిమ్రీ కథానాయికగా నటించనున్న ఈ చిత్రంలో దక్షిణాదికి చెందిన కొందరు అగ్ర నటులు భాగం కానున్నారని తెలిసింది. టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతున్నది.