న్యూఢిల్లీ, అక్టోబర్ 19 : దేశంలోని ఐఐటీలు, ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ సంస్థల్లో ప్రవేశం కోసం నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్ 2026 షెడ్యూల్ విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం సెషన్ 1 పరీక్షలు వచ్చే ఏడాది జనవరి 21 నుంచి 30 వరకు, సెషన్ 2 ఏప్రిల్ 1 నుంచి 10 వరకు జరుగుతాయి. జనవరి సెషన్ రిజిస్ట్రేషన్ ఈ ఏడాది అక్టోబర్‌లో, ఏప్రిల్ సెషన్‌కు జనవరి నెలాఖరులో ప్రారంభమవుతుంది. అభ్యర్థుల సౌలభ్యం కోసం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత దేశంలోని ఐఐటీలు, ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ సంస్థల్లో ప్రవేశం కోసం నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్ 2026 షెడ్యూల్ విడుదలైంది.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం సెషన్ 1 పరీక్షలు వచ్చే ఏడాది జనవరి 21 నుంచి 30 వరకు, సెషన్ 2 ఏప్రిల్ 1 నుంచి 10 వరకు జరుగుతాయి. దృష్టిలో ఉంచుకుని ఈసారి పరీక్షా కేంద్రాలను పెంచడమే కాక, ఆధార్ ఆధారిత నిర్ధారణ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయాలని ప్రణాళిక వేస్తున్నట్టు ఎన్టీఏ తెలిపింది. దరఖాస్తు ధ్రువీకరణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అభ్యర్థులు ఆధార్ సమాచారానికి మ్యాచ్ అయ్యేలా విద్యార్థుల వ్యక్తిగత వివరాలను దరఖాస్తు సమయంలో పొందుపర్చాలని, పరీక్ష సెషన్‌కు మూడు రోజుల ముందు అభ్యర్థులు అడ్మిట్ కార్డులు పొందవచ్చునని పేర్కొన్నది.