హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ అరాచక పాలన నుంచి తెలంగాణ రాష్ర్టాన్ని, రైతులను, కాళేశ్వరం ప్రాజెక్టును, హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ ఎన్నారై సెల్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఎన్నారై సెల్ యూకే ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సెంట్రల్ లండన్‌లోని టావోస్టిక్ స్వేర్‌లోని గాంధీ విగ్రహం వద్ద ఆదివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసి ప్రజలను మోసం చేసిందంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఉన్న బాకీకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో తెలంగాణ వికాసం జరిగితే, సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో విధ్వంసం జరుగుతున్నదని ఆరోపించారు.
కాంగ్రెస్ పాలనలో ఎకడ చూసినా రైతుల ఆత్మహత్యలు కనిపిస్తున్నాయని విమర్శించారు. హైడ్రా పేరుతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను నాశనం చేశారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎన్నారై సెల్ యూకే అధ్యక్షుడు నవీన్‌రెడ్డి, ఉపాధ్యక్షులు హరిగౌడ్ నవాపేట, సత్యమూర్తి చిలుముల, రవికుమార్ రేటినేని, అడ్వైజరీ బోర్డు వైస్‌చైర్మన్ గణేశ్ కుప్పాల, కార్యదర్శులు మల్లారెడ్డి, సురేశ్ గోపతి, అబ్దుల్ జాఫర్, ఐటీ, మీడియా పీఆర్ కార్యదర్శి రవిప్రదీప్ పులుసు, సంయుక్త కార్యదర్శులు నవీన్ మాదిరెడ్డి, ప్రశాంత్‌రావు కటికనేని, రామకృష్ణ కలకుంట్ల, యూత్ వింగ్ కార్యదర్శి ప్రశాంత్ మామిడాల, సోషల్ మీడియా కన్వీనర్, మెంబర్ షిప్ కోఆర్డినేటర్ అంజన్‌రావు తదితరులు పాల్గొన్నారు.