మంగళవారం 02 మార్చి 2021
Narayanpet - Jan 06, 2021 , 00:50:07

సదరం క్యాంప్‌ సక్రమంగా నిర్వహించాలి

సదరం క్యాంప్‌ సక్రమంగా నిర్వహించాలి

నారాయణపేట టౌన్‌, జనవరి 5 : సదరం క్యాంప్‌ను సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్‌ హరిచందన నిర్వాహకులను ఆదేశించా రు. మంగళవారం పట్టణంలోని కలెక్టర్‌ కా ర్యాలయంలో సదరం క్యాంప్‌ మెడికల్‌ బోర్డు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు ఒకసారి స్లాట్‌ బుకింగ్‌ తేదీలను నిర్వహించనున్నటు, అందులో భాగంగానే జనవరి నుం చి మార్చి నెల వరకు ప్రతి సోమవారం, బుధవారం కలిపి 40 మందికి స్క్రీనింగ్‌ పరీక్షలు చేయనున్నట్లు చెప్పారు. బుద్ధమాంధ్యం, మూగ, చెవుడుకు సంబంధించి వికలత్వం ఉన్న వారికి మహబూబ్‌నగర్‌ జిల్లా దవాఖాన, శారీరక వికలత్వం ఉన్న వారికి నారాయణపేట జిల్లా దవాఖానలో పరీక్షలు చేయించుకోవాలన్నారు. జిల్లాలో కొన్ని తప్పుడు సర్టిఫికెట్లు ఉన్నాయని ఫిర్యాదులు వ చ్చాయని, వాటిని పరిష్కరించేందుకు నలుగురు అధికారులతో కమిటీ వేశామన్నారు. ఈ కమిటీ లో కన్వీనర్‌గా అదనపు ప్రాజెక్టు డైరెక్టర్‌ డీఆర్డీఏ సత్యనారాయణ, సభ్యులుగా జిల్లా దవాఖాన సూపరింటెండెంట్‌ మల్లికార్జున్‌, డాక్టర్‌ చక్రధర్‌, డీడబ్ల్యూవో పీడీ జైపాల్‌రెడ్డి, మెప్మా పీడీ కృష్ణమాచారి ఉంటారన్నారు. కలెక్టర్‌ పేషీకి వచ్చిన ఫిర్యాదుల్లో వికలత్వం పరిశీలించాలన్నారు. సమావేశంలో డీపీఎంలు పాల్గొన్నారు. 


VIDEOS

logo