ఆదివారం 07 మార్చి 2021
Narayanpet - Dec 29, 2020 , 03:06:14

క్రికెట్‌ పోటీ విజేతలకు బహుమతులు అందజేత

క్రికెట్‌ పోటీ విజేతలకు బహుమతులు అందజేత

నారాయణపేట: స్థానిక క్రికెట్‌ మైదానంలో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన  క్రికెట్‌ పోటీల్లో విజేత జట్టు కు, రన్నరప్‌ జట్టుకు ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి బహుమతులను ప్రదానం చేశారు. విజేతగా నిలిచిన యంగ్‌ స్టార్‌ గుర్మిట్‌కల్‌ జట్టుకు రూ.41వేలు, రన్నరప్‌గా నిలిచిన 11 వారియర్స్‌ లింగప్ప జట్టుకు రూ.21వేల నగదుతో పాటు ట్రోఫీలు, సెమీ ఫైనల్‌లో ఓడిన హం బంజారా, మద్దెల్‌బీడ్‌ మహిపాల్‌రెడ్డి జట్లకు రూ. 5వేల చొప్పున నగదు పురస్కారం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మెన్‌ కన్నజగదీశ్‌,  టీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు కోట్ల రాజవర్ధన్‌రెడ్డి, కోయిల్‌కొండ జెడ్పీటీసీ విజయ్‌భాస్కర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు కె.సుదర్శన్‌రెడ్డి, అమ్మపల్లి చెన్నారెడ్డి, విజయ్‌సాగర్‌, భీంరెడ్డి, మార్కెట్‌ డైరెక్టర్‌ గట్టు రఘు, ఆర్గనైజర్‌ అడ్వకేట్‌ బాపునగర్‌ రవికుమార్‌, హుస్సేన్‌ పాల్గొన్నారు.


VIDEOS

logo