బుధవారం 20 జనవరి 2021
Narayanpet - Nov 30, 2020 , 02:35:07

మనక్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి

మనక్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి

నారాయణపేట రూరల్‌ : ఇన్‌స్పైర్‌ మనక్‌కు ఎంపికైన విద్యార్థులు తమ ప్రాజెక్ట్‌ నమూనాలను గైడ్‌ టీచర్‌ సహాయంతో తయారు చేసుకొని వచ్చే నెల 1 నుంచి 10 వ తేదీలోగా మనక్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని జిల్లా సైన్స్‌ అధికారి భానుప్రకాశ్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా కారణంగా ఈ ఏడాది పోటీలను ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించేందుకు ప్రత్యే క యాప్‌ను రూపొందించి వాటిపై అధికారులు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఇది డిసెంబర్‌ 1న ప్రారంభమవుతుందని, వీటిని గూగుల్‌ ప్లే స్టోర్‌ లో మనక్‌ కాంపిటేషన్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. అప్‌లోడ్‌ చేసిన వాటిని న్యాయ నిర్ణేతలు వచ్చే నెల 10 నుంచి 15వ తేదీ వరకు ప్రతి రోజూ 50 వీడియోలను పరిశీలిస్తారన్నారు. జిల్లా నుంచి 89 మంది విద్యార్థులు ఈ పోటీలకు ఎంపికైనట్లు ఆయన తెలిపారు.logo