నకిరేకల్, మే 11 : ఆరు గ్యారంటీలను అమలుచేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయక ప్రజలను మోసం చేసిందని, అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలంతా బీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్‌ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని జడ్పీటీసీ మాద ధనలక్ష్మీనగేశ్గౌడ్ అన్నారు. క్యామ మల్లేశ్‌ను గెలిపించాలని కోరుతూ శనివారం మండలంలోని వల్లభాపురంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకిచ్చిన హామీలను అమలుచేయలేని కాంగ్రెస్‌కు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు భీమనబోయిన ప్రసాద్, నాయకులు మాద లక్ష్మీనారాయణ, భీమనబోయిన వెంకటేశ్వర్లు, బత్తిని రామకృష్ణ, అంబటి శ్రీను, ఉడుగుల భిక్షం, తీర్పారి సైదులు, మొరుసు చలమంద పాల్గొన్నారు.
గట్టుప్పల్, మే 11 : చేనేత కార్మికులకు తోడుగా నిలిచింది బీఆర్ఎస్సేనని జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం అన్నారు. బీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్‌ను గెలిపించాలని కోరుతూ శనివారం మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా మోసగించిన తీరును వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ అవ్వారి గీతా శ్రీనివాస్, ఎంపీటీసీ చెరిపల్లి భాసర్, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు బండారి చంద్రయ్య, నాయుకులు పున్న కిశోర్, కర్నాటి అబ్బయ్య, జూలూరి పురుశోత్తం, మోదుగు శంకర్‌రెడ్డి, కర్నాటి వెంకటేశం, జలాలుద్దీన్, పెదగాని శ్రీను, నారని జగన్, గజవెల్లి లక్ష్మయ్య, నేలంటి వెంకటేశం, పున్న ఆనంద్, గుత్తి సంతోష్, పున్న చంద్రశేఖర్, పెదగాని శ్రీను పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ భవనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్‌ను గెలిపించాలని కోరుతూ శనివారం కట్టంగూర్‌లో జడ్పీటీసీ తరాల బలరాములుతో పాటు , నాయకులు ప్రచారం నిర్వహించారు. నార్కట్‌పల్లి పట్టణంలో, చిట్యాలలోని 4వ వార్డులో, శాలిగౌరారం మండలం మాదారంలో, కేతేపల్లి మండలంలోని భీమారంలో, మర్రిగూడ మండలం మేటి చందాపురంలో ప్రచారం నిర్వహించారు. మునుగోడు మండలం కొరటికల్, జక్కలివారిగూడెంలో బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్ కూతురు ఆరోని ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు.