ప్రభుత్వ భూములను కాపాడాలి
మండలంలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను కాపాడాలని జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అధికారులను ఆదేశించారు.
- జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం
నార్కట్పల్లి, జనవరి 11: మండలంలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను కాపాడాలని జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక మండల ప్రజా పరిషత్ సమావేశ కార్యాలయంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములు కబ్జాలకు గురైతే సహించేది లేదని హెచ్చరించారు.
త్వరలో ప్రభుత్వ భూముల సర్వే నిర్వహించాలని సూచించారు. మండలంలో విద్యుత్ సరఫరా సరిగా లేదని, మిషన్ భగీరథ పైప్లైన్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని పలు గ్రామాల సర్పంచ్లు సభ దృష్టికి తీసుకురాగా వెంటనే ఆ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సంక్షేమ పథకాలు అందించాలని, అలాగే మండల అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. అనంతరం ఈ నెలఖారున పదవీ విరమణ పొందనున్న సర్పంచ్లను సత్కరించి మెమెంటోలు అందజేసి సన్మానించారు. సమావేశంలో వైస్ ఎంపీపీ కల్లూరి యాదగిరి, ఎంపీడీఓ యాదగిరి, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

