కట్టంగూర్, జూలై 25 : యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని డీవైఎఫ్ఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి మల్లం మహేశ్ అన్నారు. గంజాయి వద్దు ఆరోగ్యం ముద్దు అనే నివాదంతో డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టిన సైకిల్ యాత్ర శుక్రవారం కట్టంగూర్కు చేరుకుంది. ఈ సందర్భంగా కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
డ్రగ్స్ వంటి వాటి పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండి, డ్రగ్స్ ను నివారించేందుకు కృషి చేయాలన్నారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా చేపట్టిన సైకిల్ యాత్ర ఆగస్టు 2 వరకు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ముసుకు సుధాకర్, శ్రీకర్, గుండు నరేశ్, కట్ల లింగస్వామి, మహేశ్, వంగూరు చంద్రశేఖర్, సులోచన, సామాజిక కార్యకర్త చెరుకు శ్రీను, జాల అంజనేయులు, గోపి పాల్గొన్నారు.