కట్టంగూర్, జూన్ 14 : యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శనివారం కట్టంగూర్ మండల కేంద్రంలో జిల్లా స్థాయి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. క్రీడలు శారీరక, మానసిక దృఢత్వానికి దోహాద పడుతాయన్నారు. దేశ భవిష్యత్ యువత చేతుల్లో ఉందని, చెడు వ్యసనాలకు అలవాటు పడి భవిష్యత్ నాశనం చేసుకోవద్దన్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదుగాలని ఆకాంక్షించారు. క్రీడల్లో గెలుపోటములు సమానంగా స్వీకరించాలని, ప్రతిభ చాటిన క్రీడాకారులకు స్సోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు లబిస్తాయన్నారు.
కీడాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. జిల్లా స్థాయి టోర్నమెంట్ ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మాద యాదగిరి, సుంకరబోయిన నర్సింహ్మ, పెద్ది సుక్కయ్య, ఐతగోని నర్సింహ్మ, గద్దపాటి దానయ్య, గట్టిగొర్ల సత్తయ్య, మిట్టపల్లి శివ, మర్రిరాజు, గుండు శేఖర్, గుండు పరమేశ్, పులిగిల్ల అంజయ్య, ఐతగోని సైదులు, కొంపెల్లి శ్రీకాంత్, ఆకుల సోమేశ్వర్, తండు గిరి, యర్కల శివకుమార్, చిక్కుల లింగయ్య పాల్గొన్నారు.