Young Scientist 2025 | నల్గొండ విద్యా విభాగం (రామగిరి), మార్చి 6: పాఠశాల విద్యార్థులలో సృజనాత్మకతను వెలికి తీసి బాల శాస్త్రవేత్తలుగా తయారు చేయడానికి ‘యంగ్ సైంటిస్ట్- 2025’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నల్గొండ డీఈవో బి భిక్షపతి తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు ఇవాళ డీఈఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో తెలిపారు.
విద్యార్థులకు అంతరిక్ష సాంకేతికత, అంతరిక్ష శాస్త్రము అనువర్తనాలపై ప్రాథమిక జ్ఞానం అందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. ఇస్రో 24 ఫిబ్రవరి నుండి 23 మార్చి వరకు ఆన్లైన్లో ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తుందన్నారు. దరఖాస్తులను https://Jigysa.iirs.gov.in వెబ్సైట్లో సమర్పించాలన్నారు.
దరఖాస్తుకు అర్హులు వీరే..
ఒకటి జనవరి 2025 నాటికి 9వ తరగతి చదువుతూ గత ఎనిమిదవ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా 50 శాతం . ఆన్లైన్ క్విజ్ ప్రతిభకు 10 శాతం సైన్స్ మేళాలో పాల్గొన్న వారికి 10 శాతం, ఎన్సిఎస్ ,ఎన్ఎస్ఎస్ వారికి ఐదు శాతం గ్రామీణ ప్రాంతాలలో చదువుతున్న వారికి పదిహేను శాతం అదనంగా అవకాశం కల్పిస్తారని పేర్కొన్నారు.
అధిక సంఖ్యలో దరఖాస్తులు చేసేలా ప్రోత్సహించాలి – భిక్షపతి డిఇఓ
జిల్లా వ్యాప్తంగా అన్ని యజమాన్యాల ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలల్లోని విద్యార్థులు అధిక సంఖ్యలో యంగ్ సైంటిస్ట్ యువ విజ్ఞాన శాస్త్రవేత్త కార్యక్రమంలో పాల్గొనేటట్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయా మండలాల ఎంఈఓలు సైతం ప్రధానోపాధ్యాయులను చైతన్యం చేసి దరఖాస్తులు అధికంగా చేసేలా చూడాలన్నారు. పూర్తి వివరాలకు జిల్లా సైన్స్ అధికారి వనం లక్ష్మీపతిని 9848378845 లో సంప్రదించాలని సూచించారు.
S Jaishankar | అధిక సుంకాలతో భారత్ – అమెరికా వాణిజ్య సంబంధాలపై అనిశ్చితి.. జై శంకర్ ఏమన్నారంటే..?
Bandlaguda Jagir | చెత్త బండ్లగూడ.. మున్సిపాలిటీలో పారిశుద్ధ్యంపై పట్టింపేది?
Janhvi Kapoor| రామ్ చరణ్ కొత్త సినిమా నుండి జాన్వీ లుక్ రిలీజ్.. ఒక్కసారిగా పెరిగిన అంచనాలు