సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 06 : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం అర్ధరాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగింది. సూర్యాపేటలోని చర్చి కాంపౌండ్ కు చెందిన యువకుడు విడెం వినయ్ కుమార్ (32) పీఎస్ఆర్ సెంటర్ నుండి బైక్ పై ఇంటికి వెళ్తుండగా డీ మార్ట్ సమీపంలో కుక్క అడ్డురావడంతో తప్పించబోయి డివైడర్ను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయమై వినయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. యువకుడి మరణంతో ఆ కాలనీలో విషాదం నెలకొంది.