– ఎంజీయూ రౌండ్ టేబుల్ సమావేశంలో డా.బొమ్మరబోయిన కేశవులు
రామగిరి, జూలై 14 : ప్రతి ఒక్కరు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ను సద్వినియోగం చేసుకుని సమగ్ర వివరాలను అందచేయాలని సమచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డా.బొమ్మరబోయిన కేశవులు అన్నారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో సమాచార హక్కు పరిరక్షణ సమతి- ఎంజేయూ సంయుక్తంగా నిర్వహించిన ‘సర్స పై అవగాహన సదస్సు- రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ప్రజాస్వామ్యానికి మూలం ఎన్నికలు. ఎన్నికలు అంటే ఓటర్లు తప్పనిసరి. అందుకే 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు కలిగి ఉండాలి. ఓటు నమోదుకై బీఎల్వోలు ఇచ్చిన దరఖాస్తులు పూర్తి చేసి అందచేయాలని సూచించారు. అదే విధంగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు.
పారదర్శకమైన ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం చేపట్టిందన్నారు. ఎన్నికల కమిషన్ ఎన్నికలు సజావుగా జరిగేందుకు తన ప్రయత్నం చేస్తుందని, ఓటర్లుగా మన బాధ్యత మనం నిర్వహించాలన్నారు. పూర్తి వివరాలకు, బీఎల్వోలను సంప్రదించి అనుమానాలు నివృత్తి చేసుకోవాలన్నారు. ఎన్నికల కమిషన్ సమగ్ర ఓటరు జాబితా సవరణ గడువును పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎంజీయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్, సీనియర్ అసిస్టెంట్ ప్రొ.మారం వెంకటరమణరెడ్డి, అసిస్టెంట్ ప్రొ.డా.మద్దిలేటి, మచ్చేందర్, అధ్యాపకులు, విద్యార్థులు హాజరయ్యారు.