యోగా ఆరోగ్య ప్రదాయిని : ప్రొఫెసర్ బెల్లి యాదయ్య
యోగా సాధనతో విద్యార్థులు తమ శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరచుకోవచ్చునని, అనేక ఒత్తిళ్ల మధ్య అభ్యసనంపై దృష్టిసారించలేకపోతున్న యువతకు యోగా ఆరోగ్య ప్రదాయిని అని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నకిరేకల్ ప్రధానాచార్యులు, ప్రొఫెసర్ బెల్లి యాదయ్య అన్నారు.
నకిరేకల్, మే 12 : యోగా సాధనతో విద్యార్థులు తమ శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరచుకోవచ్చునని, అనేక ఒత్తిళ్ల మధ్య అభ్యసనంపై దృష్టిసారించలేకపోతున్న యువతకు యోగా ఆరోగ్య ప్రదాయిని అని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నకిరేకల్ ప్రధానాచార్యులు, ప్రొఫెసర్ బెల్లి యాదయ్య అన్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా మంగళవారం కళాశాలలో నిర్వహించిన ‘విద్యాభివృద్ధి-యోగా’ రెండోరోజు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన వైదిక్ యోగా ట్రస్ట్ నిర్వాహకులు కరుణాకర్ గురూజీ విద్యార్థులకు యోగా బోధిస్తూ నిత్య జీవితంలో అందరూ యోగాను అలవరచుకోవడం ద్వారా ప్రతివ్యక్తి తను పని చేస్తున్న రంగంలో విజయం సాధించవచ్చునని తెలిపారు.
ముఖ్యంగా విద్యా సంస్థలు యోగాను పాఠ్యాంశంగా బోధించాలన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల నకిరేకల్, వైదిక్ యోగా ట్రస్ట్ రెండు సంస్థలు అభ్యసన ఒప్పందం ( ఎం.ఓ.యు) కుదుర్చుకున్నట్టు ప్రధానాచార్యులు తెలిపారు. కార్యక్రమానికి చరిత్ర సహాచార్యులు కె.ప్రవీణ్ రెడ్డి అనుసంధాన కర్తగా వ్యవహరించగా, వారోత్సవాల కన్వీనర్, వైస్ ప్రిన్సిపాల్ నాగు, అధ్యాపకులు డా.శ్రీనివాసాచారి, శ్రీనివాస్, హరిత, మధుసూదన్ రెడ్డి, డా.శంకర్, శివశంకర్, రవీందర్, ఉపేందర్, సుభాషిణి, కార్యాలయ సిబ్బంది వెంకన్న, సుదర్శన్, కార్తీక్, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

యోగా ఆరోగ్య ప్రదాయిని : ప్రొఫెసర్ బెల్లి యాదయ్య
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

