యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 18: పంచనారసింహుడిగా విరాజిల్లుతున్న పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి వార్షిక, నవాహ్నిక బ్రహ్మోత్సవాలు శ్రీ పంచరాత్రగమశాస్త్రయుక్తంగా లోకోత్తరమైన వైభవాలతో ప్రారంభించారు. బుధవారం స్వయంభూ ప్రధానాలయంలో ప్రభాత వేళ నిత్యపూజ కైంకర్యాలు అనంతరం స్వామివారి అనుమతితో వైశేక హోమాలు, ప్రత్యేక తిరుమంజనం జరిపారు. స్వామివారిని బంగారం, వజ్ర వైడూర్యాల, వివిధ రకాల పూలతో దివ్య మనోహరంగా అలంకరించి ప్రధానాలయ ముఖ మండపంలో స్వామివారి ఆస్థానంలో వేంచేపు చేశారు. విశ్వక్సేనారాధన, నవకలాభిషేకం, స్వస్తివాచనం, రక్షాబంధనం, మంత్ర పుష్పానిరాజనాలతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురారోపణం పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో అర్చకుల మంత్రోచ్ఛారణలు, వేద పండితుల చతుర్వేద పారాయణందార్లు, రుత్వికుల ప్రబంధ పారాయణాలు, యాజ్ఞాచార్య బృందం, ఆలయ ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకుల బృందం వేదమంత్రాల నడుమ యాదగిరీశుడి ప్రధానాలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. విశ్వశాంతి, లోక కల్యాణార్థం నిర్వహించే స్వామివారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు అర్చకులు శ్రీకారం చుట్టా రు. అంతకు ముందు గర్భాలయంలో స్వయంభూవులకు ప్రత్యేక పూజలు నిర్వహించి బ్రహోత్సవాలకు స్వామివారి అనుమతిని స్వీకరించారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవ వేడుకలు నిర్విఘ్నంగా కొనసాగాలని ఉదయం 10.05 గంటలకు ఉత్సవాలకు ప్రారంభానికి ముందుగా గర్భాలయంలో స్వయంభూ వెలసిన స్వామివారిని ఉత్సవాలు నిర్వహణకు అనుమతిని స్వీకరించారు. స్వామివారి రక్షాబంధనాలు, వేదమంత్రోచ్చారణలు, డోలు వాయిద్యాలు, సన్నా యి మేళాల నడుమ ఆలయ అనువంశికధర్మకర్త బి. నరసింహమూర్తి, ఈవో భవానీశంకర్, ప్రధానార్చకులు కాండూరి వేంకటాచార్యులు, భట్టార్ సురేంద్రాచార్యులు స్వామివారి గర్భాలయంలోకి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి అనుమతిని పొందారు. బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజున ఉత్సవాల నిర్వహణకు స్వయంభూ నారసింహుడి అనుమతిని తీసుకోవడం ఆలయ సంప్రదాయం.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రెండోరోజు సందర్భంగా ఉదయం 8 గంటలకు అగ్నిప్రతిష్ఠ, 11 గంటలకు ధ్వజారోహణం, సాయంత్రం 6.30 గంటలకు భేరీపూజ, దేవతాహ్వానం, హవనం కార్యక్రమాలు నిర్వహిస్తారు.
యాదగిరిగుట్ట స్వామి వారి బ్రహ్మోత్సవాలను శాస్ర్తోక్తంగా ప్రారంభించారు. ప్రధానాలయంలో ముఖ మండపంలో ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్ర్తాలతో దివ్య మనోహరంగా ఆలకంరించిన స్వామివారిని ప్రధానాలయ ముఖ మండపంలో తూర్పు అభిముఖంగా అదిష్టింపజేశారు. స్వామివారికి నవకలాభిషేకం అనంతరం బ్రహ్మోత్సవాలను నిర్విఘ్నంగా కొనసాగాలని, లోకాలకు శుభాలు కలగాలని వేద మంత్రాలను పఠిస్తూ శ్రీపాంచరాత్రగమశాస్త్రరీతిలో శ్రీ విశ్వక్సేన ఆరాధన జరిపారు. లోకమంతా సుభిక్షంగా, ఆయూరారోగ్యాలతో ఉండాలని కోరుతూ స్వస్తివాచన మంత్రాలతో స్వామివారిని వేడుకుంటూ స్వస్తివాచనం కార్యక్రమాన్ని ప్రధానార్చక బృందం కొనసాగించారు. స్వస్తి పుణ్యాహవాచనంలో భాగంగా శుద్ధజలాలతో స్వామివారి ప్రధానాలయం, గర్భాలయం, ఆలయ మాఢవీధులు, ప్రాకార మండపాలతో సంప్రోక్షణ గావించి శుద్ధి కార్యక్రమం చేపట్టారు. రక్షాబంధనాలను ప్రత్యేక పాత్రలో ఉంచి విమల మొదలగు అష్టదళ శక్తి దేవతలను ఆవాహనం చేసి మంత్రాలను ధూపదీపాలను సమర్పిస్తూ రక్షాబంధన వేడుకలను జరిపారు. అనంతరం స్వయంభూ నారసింహస్వామి వారికి, ఆండాళ్ అమ్మవారు, ఆళ్వారు, రామానూజాచార్యులు, విశ్వక్సేనుడు, ఉత్సవ మూర్తులకు కంకణధారణ గావించారు. అనంతరం నిర్వహక బృందం, భక్తులకు రక్షా బంధనలను ధరింపజేశారు. రుత్విగరణం, స్వామివారికి మం త్ర పుష్పనిరాజన కార్యక్రమాలు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్ర్తానుసారంగా ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, యజ్ఞాచార్య బృందం, ఆలయ అర్చక బృందం, పారాయణందార్లు అత్యంత వైభవంగా నిర్వహించారు.
యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా నిత్యారాధనల అనంతరం సాయంత్రం 6.30 గంటలకు మృత్సంగ్రహణం, అంకురారోపణ వేడుకలను ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు అర్చక బృందం పాంచరాత్రగమ శాస్ర్తానుసారంగా నిర్వహించారు. అంకురారోపణకు అవసరమైన మట్టిని సంపాందించడానికి ఆలయ అర్చక బృందం మంగళవాయిద్యాలతో వెళ్లి భూమాతను పూజించి పుట్టమన్ను స్వీకరించారు. మట్టిని కొత్త పాలికలో వేసి వాటి లో నవధాన్యాలు ఉంచి మంత్ర జలంతో ప్రోక్షణ చేసి తొమ్మిది పాలికలలో ఆయా మంత్రాలతో ఆవాహనలు గావించారు. హైదరాబాద్‌కు చెం దిన మెడికవర్ దవాఖాన సౌజన్యంతో ఈనెల 28వ తేదీ వరకు కొండపైన ప్రధాన కార్యాల యం వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్న ట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో భవానీశంకర్, అనువంశికధర్మకర్త నరసింహమూర్తి, కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, డీఈవో దోర్భల భాస్కర్, ప్రధానార్చకులు కాండూరి వెం కటాచార్యులు, భట్టార్ సురేంద్రాచార్యులు, ఆర్డీ వో, ఏఈవోలు రఘు, నవీన్, పర్యవేక్షకులు రాజన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.