బీబీనగర్, సెప్టెంబర్ 18 : చిన్నేటి వాగులో యువకుడు గల్లంతయ్యాడు. స్థానికులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, నాచారానికి చెందిన దండు నరేశ్ (24) అనే యువకుడు బీబీనగర్ మండల పరిధిలో గూడూరు గ్రామ శివారులో ఉన్న చిన్నేటి వాగును దాటే ప్రయత్నం చేశాడు. వరద ఉధృతి ఎక్కువవడంతో నీళ్లలో పడి వరదలో కొట్టుకుపోయాడు. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సంఘటనా స్థలాన్ని భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి పరిశీలించారు. ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టింది.
Bibinagar : చిన్నేటి వాగులో యువకుడి గల్లంతు