యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహుడి బాలాలయంలో శుక్రవారం లక్ష్మీపూజలు అత్యంత వైభవంగా జరిగాయి. బాలాల యంలో కవచమూర్తులకు నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతంతో మెల్కొ లిపి స్వామి వారిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించి, ఉదయం 8 గంటలకు నిర్వహించిన సుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు, హోమం జరిపారు. సాయంత్రం ఊంజల్ సేవను కోలాహలంగా నిర్వహిం చారు. మహిలు సేవలో పాల్గొని తరించారు. శ్రీలక్ష్మి అమ్మవారికి విశేష పుష్పాలతో ఆలంకారం జరిపారు.
బాలాలయం ముఖమండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు విడుతలుగా రూ.516 టికెట్ తీసుకున్న భక్తులకు సువర్ణ పుష్పార్చన జరిపించారు. మొదటగా శ్రీమన్యుసూక్త పారాయణం జరిపారు. ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చన జరిపారు.
ఉప ప్రధానార్చకుల ఆధ్వర్యంలోని అర్చక బృందం వైభవంగా ఈ పూజలు నిర్వహించారు. ముత్తైదువులు మంగళహారతులతో అమ్మవారిని స్తుతిస్తూ పాటలు పాడుతూ సేవ ముందు నడిచారు. తిరువీధి సేవ అనంతరం అమ్మ వారిని బాలాలయం ముఖ మంటపంలోని ఊయలతో శయనింపు చేయించారు. గంట పాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ లాలిపాటల కోలాహలంగా కొనసాగింది. ప్రతి రోజూ నిర్వహించే నిత్య కల్యాణోత్సంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.