Hyderabad | రెండో భార్య మరొకరితో సన్నిహితంగా ఉందని అనుమానం.. తుపాకీతో కాల్చి చంపిన భర్త
Hyderabad | హైదరాబాద్‌లో దారుణం జరిగింది. అనుమానంతో మల్కాజ్‌గిరిలో భార్యను భర్త తుపాకీతో కాల్చి చంపాడు.
Hyderabad | హైదరాబాద్‌లో దారుణం జరిగింది. అనుమానంతో మల్కాజ్‌గిరిలో భార్యను భర్త తుపాకీతో కాల్చి చంపాడు.
వివరాల్లోకి వెళ్తే.. మల్కాజ్‌గిరికి చెందిన అరుణ్ అనే వ్యక్తికి పదేళ్ల క్రితం ఓ మహిళతో పెళ్లయ్యింది. వివాహం అనంతరం భార్యతో విబేధాలు తలెత్తాయి. అరుణ్ వేధింపులు తట్టుకోలేక ఆమె దూరంగా ఉంటోంది. మొదటి భార్య వదిలేసి వెళ్లిపోవడంతో ఆమె సొంత చెల్లెలు ఉషారాణితో అరుణ్ సహజీవనం మొదలుపెట్టాడు. ఐదేళ్ల క్రితం యాదగిరిగుట్టలో ఉషారాణిని వివాహం చేసుకున్నాడు.
అప్పటినుంచి అరుణ్, ఉషారాణి మల్కాజ్‌గిరిలోని మారుతి నగర్లో ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. అయితే ఉషారాణి మరొకరితో సన్నిహితంగా ఉంటోందని, చాటింగ్ చేస్తోందని అరుణ్ అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయంలో కొద్ది నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. గొడవల కారణంగా ఉషారాణి సైతం భర్తకు దూరంగా ఉంటోంది. దీంతో భార్య మీద పగ పెంచుకున్న అరుణ్.. ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఇవాళ మాట్లాడుకుందాం రమ్మని ఇంటికి పిలిచి తుపాకీతో కాల్చాడు.
బుల్లెట్ తగలడంలో ఉషారాణి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఉషారాణిని చంపేందుకు అరుణ్‌కు తుపాకీ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు? అన్న అంశాలపై ఆరా తీస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
KTR | జనాభా లెక్కల ఆధారంగా మా గొంతు కోస్తే ఊరుకోం.. నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ వివరణ
Rayapati | అనారోగ్యంతో మాజీ ఎంపీ రాయపాటి కన్నుమూత..!
Student Attempts Suicide | ర్యాగింగ్ వల్ల వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. ఐదుగురు సీనియర్లు సస్పెండ్
BRS | మహమ్మద్ తాజుద్దీన్ బాబా కుటుంబానికి రూ. 10లక్షలు ఆర్థిక సాయం
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

